పుట:కాశీఖండము.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

315


దాను గొడుకులు నొకకొంత తడసె నేని
గుతిలపఱుపరె నృపుబంట్లు గుదెలవారు.

289


వ.

అప్పుడు చతురంతమహీమండలంబు సర్వదేవతాశూన్యం బగుటం జేసి విఘ్నేశ్వరావాసంబుల స్తవరాజస్తోత్రపాఠంబును, గాళికాకటంబుల హృల్లేఖాదిమంత్రజపంబును, శివసానంబులఁ బంచాక్షరీపంచబ్రహ్మపాశుపతా(ద్య)ఘోర[1]శారభాది విద్యానుసంధానంబును, విష్వక్సేనావాసంబులం బురుషసూక్తద్వాదశాక్షరాష్టాక్షరప్రధాననామానుస్మరణంబును లేక తక్కెం దక్కినవేలుపుల గుళ్లయందును సంధ్యాకాల బహుళ పటహశంఖ కాహళకోలాహలం బుడిగె. నేనునుం గర్ణాటదేశహాటక మణికిరీటంబును, గిష్కింధాచల హేమకూటమతంగగిరిప్రాంతంబును, దుంగభద్రాతటినీనైకటికంబును, భాస్కరక్షేత్రప్రాతివేశికంబును, బంపావిరూపాక్షదేవ దివ్యవికటపాటలజటాజూటకోటీపినద్ధముగ్ధేందు లేఖామయూఖకండళగళదమృతధారానిష్యందానేక సంవర్ధితసుకుమారసరళసహకార జంబుజంబీర నారికేళ కేసరకురవకాశోకశాగోటకుటజ పారిభద్రద్రాక్షారుద్రాక్షసర్జ ఖర్జూరభూర్జబిల్వచిరిబిల్వాది తరులకుంజఖంజన్మిహిరకిరణపుంజంబు నగుసామిమల విడిచి, మందరాచలంబున కరిగితి. ఇవ్విధంబున దేవసంఘంబులు దివికిం గాద్రవేయకులంబు బలిసద్మంబునకుం బోక విని నిర్ద్వంద్వంబు, నిరవగ్రహంబు, నిస్సపత్నంబునుం గాఁ గాశీనగరంబు తనకు మొదలిరాజధానిం గావించికొని దివోదాసుం డేకవాసర

  1. శాతరుద్రా