పుట:కాశీఖండము.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

శ్రీకాశీఖండము


శ్వర! నిష్కారణ మింతికిఁ
బురుషునకుం దగదు శౌచముం దడవంగన్.

198


తే.

ధరణిధరమంతపొడవుమృద్రాశి యైన
నంబునిధియంతజల మైన ననఘచరిత
భావశౌచంబుఁ బోలదు బాహ్యశౌచ
మనిరి శౌచక్రియావేదు లయినమునులు.

199


తే.

అగ్నిహోత్రాహుతులకుఁ జాంద్రాయణాన్న
పిండమునకును శౌచమృత్పిండములకు
గలశసంభవ! యుసిరికకాయలంత
మాన మని చెప్పుదురు కర్మమర్మవిదులు.

200


వ.

అనుష్ణంబులు నఫేనంబులు నబుద్బుదంబులు నక్షారంబులు నలవణంబులు నకలుషంబులు నదుర్గంధరసంబులు నయిన యుదకంబులు, నగక, నిలుచుండక, మాటలాడక, వెలిఁజూడక, వంగక, (తెలుచుండక,) వేగిరపడక, యజ్ఞోపవీతంబు విడువక, ప్రసారితపాదుండు గాక, బహిర్జానుండు గాక, చప్పుడు గాకుండ ముమ్మాఱు బ్రహ్మతీర్థంబున హృదయపర్యంతంబు డి గ్గశుద్ధిబుద్ధ్యర్థంబు ప్రాశించునది. అనంతరంబ యంగుష్ఠమూలదేశంబున నినుమాఱు [1]*గండస్థలంబున నిరియించిన యోష్ఠాధరంబులు ముమ్మాఱు స్పృశించి యనంతరంబ కుడిచేతం బుడిసిలించిన యుదకంబు వామహస్తసంపుటంబున నినిచి దక్షిణవామపాదములయందు మూర్ఖంబునందునుం బ్రోక్షించునది.* మఱియు ముమ్మాటికి వామహస్తోదకంబు స్పృశించుచు

  1. ఇది మూలాతిరిక్తవిరుద్ధముగా నున్నది. ‘త్రిఃపీత్వాంబువిశుద్ధర్థం తతఃఖాని విశోధయేత్, అంగుష్ఠమూలదేశేన ద్విర్ద్విరోష్ఠాధరౌస్పృశేత్.’ అని మూలము.