పుట:కాశీఖండము.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

శ్రీకాశీఖండము


తాపమునం జితికాస్ఠో
ద్దీపిత మగువహ్ని? యేల ధృతిఁ దొఱఁగంగన్.

164


ఉ.

భూధరరాజసన్నిభుఁడు పుష్పశరాసనుతోడిజోడు వి
ద్యాధరచక్రవర్తి నను నర్మిలిఁ దెచ్చినవాఁడు నాకుఁ గా
శీధగ నాదుక ట్టదు. నీ వశ నుండగ విశ్వనాథ! గా
శ్రీధవ! యంబికారమణ! జీవిత మేను ధరించుదాననే?

165


వ.

అని దుఃఖావేశంబున.

166


చ.

కొసరి వసంతకాలమునఁ గోయిల క్రోల్చినభంగి నేడ్చె న
బ్బిసరుహనేత్ర కొండచఱిఁ బెద్దయెలుంగున వెక్కివెక్కి వె
క్కస మగుమన్యువేగమునఁ గాటుకన్నులనీరు సోన లై
యుసిరికకాయలంతలు పయోధముల్ దిగజాఱునట్లుగన్.

167


మ.

మలయం బెక్కడఁ గాశి యెక్కడ! యసన్మార్గంబు వాటించి తె
క్కలిదైనం బిటు నాకు నీయహితముం గావించునే? యంచు వే
తల యూఁచెం గలకంఠి మచ్చెరువునం దాటంకరత్నప్రభల్
పలకంబాఱిన చెక్కుటద్దములపైఁ బైపై విలంఘింపఁగాన్.

168


వ.

వెండియు నక్కన్యక కర్పూరకదళికాద్రుమనిర్యన్నిర్యాసధారాద్రవవాసనానుగంధంబు లగుగంధసారగిరినితరంబ నిర్ఝరాంభఃప్రవాహంబున ముఖప్రక్షాళనం బాచరించి విద్యాధరోపరివిరచిత(చితా)గంధసా[1]రకాష్ఠంబుల రవుల్కొని గంధకరటికర్ణతాళతాళవృత్తాంతతాండవప్రస్తానవిస్తారితంబు లగుమారుతంబులవలనం బెచ్చుపెరిఁగి విచ్చలవిడిన్ మండుచిచ్చునకుం బ్రదక్షిణంబు వచ్చి నిసర్గకాతరంబు లగుకటాక్షవీక్షణంబులు పుష్పాంజలివిక్షేపంబులభంగి నంగీకరింపఁ జంపుడుగట్ట యగు

  1. రేంధనకాండప్రకాండఖండం