పుట:కాశీఖండము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక 15

తే. యతఁడు వొగడొందు రాయవేశ్యాభుజంగు
డవధిమహిధరచరమగాఢాంధకార
ధట్టఘట్టనలటహప్రతాపతపనుఁ
డల్లనరనాథుదొడ్డభూవల్లభుండు. 51

శా. ఔరా! యల్లయరెడ్డి దొడ్డవసుధాధ్యక్షుండు ధాటీచమూ
భేరీభాంకృతిఘోరఘోషమున నిర్భేదించె నొడ్డాది శృం
గారంకోటయు లోఁతుగడ్డ(ద్ద)యును నుద్ఘాటించె నత్యుద్ధతిన్
క్షీరాంభోధితటంబున న్నిలిపె దిక్సీమాజయస్తంభముల్. 52

మ. హరి దాఁటించెఁ బురోపకంఠమున వాహ్యాళిప్రదేశంబునం
దరరే యల్లయరెడ్డినందనుఁడు దొడ్డయ్యక్షమాధీశ్వరుం
డిరువైనాలుగుమూళ్ళమేర యనుగో సెక్కింపఁగా నేలయ
ద్ధరణీనాథునికీర్తి దాఁటెఁ గడు నుద్దండించి బ్రహ్మాండముల్. 53

మ. సరి వే రీజలరాశివేష్టితమహీచక్రంబున న్విక్రమా
పరగాండీవికిఁ జక్రవాళమహిభృతపర్యంతవిశ్వంభరో
ద్ధరణప్రౌఢభుజాభుజంగమునకున్ ధాత్రీశు లల్లాడభూ
వరునన్నయ్య కకుంఠవాఙ్మయకళావైకుంఠరాట్శయ్యకున్. 54

సీ. జిష్ణువైభవరేఖఁ జెలువొందుటయుఁ గాక
పావకవిస్ఫూర్తిఁ బరఁగు టెట్లు
ధర్మరాజవిభూతి దర్పించుటయుఁ గాక
పుణ్యజనోపాఖ్యఁ బూను టెట్లు
మహినిఁ బ్రాచేతసమహిమఁ దాల్చుటయుకా
దగ జగత్ప్రాణాఖ్యఁ దాల్చు టెట్లు
ధనదత్వవిఖ్యాత ఘనత నొండుటఁ గాక
శంకరసుషమచే జరగు టెట్లు