పుట:కాశీఖండము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 శ్రీకాశీఖండము

కుచకుంభములమీఁది కుంకుమంబు
బారహదొంతిభూపాలలీలావతీ
గండస్థలంబులఁ గలికినవ్వు
కలువపల్ల్యొడ్డాదికటకాధిపతవధూ
సీమంతవీథులఁ జేరుచుక్క
తే. యల్లడాధీశువేమక్షమాధినాథు
భూరినిష్ఠురధాటీవిహారచటుల
సైన్యనాసీరతుక్ఖారశఫపుటోత్థ
వింధ్యపార్శ్వవసుంధరావిపులధూళి. 34

సీ. పండువాసురధాని పావడం బంపిన
భద్రేభములు వీటఁ బాళె ముండు
నొడ్డెధాత్రీనాథుఁ డుపదఁ బుత్తెంచిన
బింబాధరోష్ఠి సంబెళ వహించుఁ
గర్ణాటభూపతి కానుక యనిపిన
ముక్తాతపత్త్రంబు మ్రోల మెఱయు
యవనాధిపతి యుపాయనముగా నొసఁగిన
పాగాహయంబులు వాగె వచ్చు
తే. దూర మంతంత బారుహదొంతిమన్నె
సప్తమాడియ రాజన్యసమితి మ్రొక్కు
రాయవేశ్యాభుజంగసంగ్రామపార్థ
గాయిగోవాడవేమనక్ష్మాధవునకు. 35

క. చటులత నల్లయవేమన
పటుధాటీవిజయభేరిభాంకృతి మొరయున్