పుట:కాశీఖండము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక 9

తే. బ్రళయసంరంభశుంభదారభటిపటిమ
భయదఫాలాక్షభావసంభవదభంగ
దహనమహనీయదివ్యప్రతాపవిసర
దతులజయహారి దొడ్డయయల్లశౌరి. 28

మ. జయధాటీవిజయంబులన్ విలయజంఝామారుతాడంబర
స్మయహారిప్రతిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనం
బయి యొడ్డాడి భయంకరోడ్డమరశౌర్యం బైన శ్రీరెడ్డి దొ
డ్డయ యల్లాడనృపాలరాహునకు బిట్టల్లాడు దిక్చక్రముల్. 29

మ. లలితాహంకృతి దొడ్డభూవిభుని యల్లాడక్షమానాథు నా
జుల మార్కొన్న విరోధిరాజు లమరస్తుత్యప్రతాపప్రభా
కలితశ్రీయుతులై సుఖింతు రెలమి గల్యాణశైలంబుపైఁ
గలధాతామలహర్మ్యరేఖల మరుత్కాంతాకుచాగ్రంబులన్. 30

మ. అనవేమక్షితిపాలుపౌత్రియగు వేమాంబామహాదేవికిన్
ఘనుఁ డయ్యల్లడభూమిపాలునకు సంగ్రామస్థలీగాండివుల్
తనయు ల్వేమవిభుండు వీరవసుధాధ్యక్షుండు దొడ్డప్రభుం
డును నన్నయ్యయు బాహువిక్రమకళాటోపప్రతాపోద్ధతుల్. 31

వ. అం దగ్రజుండు. 32

మ. కొనియెం గంచుకముల్ సముద్భటనటద్ఘోటీభటప్రౌఢిఁ గై
కొనియె న్వేడుకఁ జీడికాడ యహితక్షోణీశు లల్లాడఁ జే
కొనియ న్మాకవరంబు వీఁక మదవద్ఘోరారిసంహారియై
ఘనుఁ డల్లాడమహీశువేమన నిరాఘాటైకధాటీగతిన్. 33

సీ. సప్తమాడియరాయచంద్రబింబాననా
చికురవల్లరులపైఁ జిన్నిపువ్వు
ఝాడెజంతుర్నాటిజననాథశుద్ధాంత