పుట:కాశీఖండము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8 శ్రీకాశీఖండము

ధాటీసమాటీకనాటోపవిధ్వస్త
కుటిలాహితుఁడు పెదకోటశౌరి
పంటాన్వయక్షీరపాథోధిసంపూర్ణ
పూర్ణిమావిధుఁడు తా ప్రోలవిభుఁడు
ప్రోద్దామదోఃప్రతాపోదయవ్యతికర
చ్ఛాయాధిపుండు దొడ్డాయనృపతి
తే. హాటకాచలధైర్యుండు మేటిబిరుదు
పాటి కలవాఁడు కరహాటలాటబోట
గౌళకర్ణాటదేకరాట్కటకసుకవి
కోటినుతకీర్తి శ్రీపిన్నకోటరెడ్డి. 25

తే. పంటకులరాజు దొడ్డభూపాలునకును
బరమకల్యాణి యన్నమాంబకును సుతులు
ప్రోలభూపతియును గోటభూపతియును
భువననుతకీర్తి యల్లాడభూపతియును. 26

వ. అందు. 27

సీ. కుటిలారిరాట్కంఠకుహరాంతములఁ గాని
క్రీడింపనీఁడు కౌక్షేయకాహి
హరిదంతసౌధశృంగాగ్రవీథులఁ గాని
తిలకింపనీఁడు కీర్తిధ్వజంబు
నాశ్రితబంధుమిత్త్రారామములఁ గాని
సాగనీఁడు కృపావసంతలక్ష్మి
హరిణభృన్మూర్థన్యచరణాబ్జములఁ గాని
మరుగనీఁడు నిజాత్మమధులిహంబుఁ