చతుర్థాశ్వాసము
187
| దఱి చూచి యిచ్చె నెద్దానిఁ బట్టికిఁ దల్లి | |
తే. | న(య)ట్టినవరత్నమయ మైనయంగుళీయ | 99 |
వ. | చూచి తనసొ మ్మౌట యెఱింగి దీక్షితుం డక్షక్రీడాజీవనుం గదిసి యెలుంగుత్తి యీయంగుళీయకంబు నీ కెట్టు గలిగె? ఉన్నరూపు చెప్పు. తప్పఁ జెప్పితేని భూపాలుసన్నిధిం బెట్టి నిజంబు దెలిపి దండింతు ననిన జూదరి నీతనయుండు గుణనిధి నెత్తంబున నొడ్డిన విత్తంబునకై యీయంగుళీయకంబు నా కిచ్చె. మఱి బంగారుభృంగారుకర్కరీకలాచికలు, తలియలు, పళ్లెరంబులు, తామ్రపాత్రంబు, లారకూటఘటంబు లన్నియుం దాకట్టువెట్టియు దురోదరక్రీడాపరాయణుండై పట్టణంబులోనం జరియించుచున్నవాఁడు. | 100 |
తే. | అక్షధూర్తులలోన నీయనుఁగుఁగొడుకు | 101 |
వ. | అనిన విని లజ్జాక్రోధంబులు మనంబున ముప్పిరిగొన యజ్ఞదత్తుం డర్ధముండితం బైనమూర్ధంబున నీర్కావిదోవతి నఱిముఱిఁ జుట్టుకొని యింటి కేతెంచి మొగంబు గంటువెట్టుకొని సోమిదమ్మ! ఏమిచేయుచున్నదాన! విటు రమ్ము! నీకొడు కెక్కడం బోయెఁ? బోవుఁ గాకేమి! విను మని యిట్లనియె. | 102 |