తృతీయాశ్వాసము
159
| దివ్యబాలకుఁ డొకరుండు దేజరిల్లెఁ | 241 |
చ. | ప్రవిశదభంగి దివ్యశిశురత్నము సప్రణవాక్షరంబుగా | 242 |
వ. | అప్పుడు విశ్వానరుం డానందాశ్రుపూర్ణలోచనుండును, రోమాంచకంచుకితాఖిలావయవుండును, గద్గదికానిరుద్ధకంఠధ్వనియు నయి యంజలీపుటంబు లలాటతటంబున ఘటియించి యేకతంబుగా బ్రహ్మం బద్వితీయంబు నిత్యంబు సత్యం బొక్కరుండ రుద్రుం డొక్కరుండ కర్త యెవ్వం డట్టి నీకు నమస్కారంబు. రజ్జువందు సర్పంబును, శుక్తియందు రౌప్యంబును, మరుమరీచికయందు సలిలంబును బోలె నెవ్వానియందుఁ బ్రపంచంబు గానంబడు నట్టినీకు నమస్కారంబు. తోయంబునందు శైత్యంబుసు, వహ్నియందు దాహకత్వంబును, దపనునందుఁ దాపంబుసు, జంద్రునందుఁ బ్రసాదంబును, బుష్పంబునందు సుగంధంబును, దుగ్ధంబునందు ఘృతంబునుంబోలె సర్వంబునం దెవ్వం డంతరాత్ముఁ డై యుండు నట్టినీకు నమస్కారంబు. శబ్దంబు గ్రహించు నశ్రవణుండు, గంధం బాఘ్రాణించు నఘ్రాణుండు, దూరంబు నడచు ననంఘ్రి, చూచు నలోచనుండు, రసంబుఁ గొను నరసజ్ఞుం డెవ్వం డట్టినీకు నమస్కారంబు. నిజభక్తుండు దక్క విష్ణువిరించిపురందరాదిబృందారకు లెవ్వానికందువ యెఱుంగ రట్టినీకు నమస్కారంబు. గోత్రంబు, జన్మంబు, నామంబు, రూపంబు, శీలంబుఁ దెలియ | |