ఉపేంద్రవజ్రము(జతజగగ, 8.)
| | ఉపేంద్రవజ్రాహ్వయ మొప్పు నిం పై యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్ | |
ఉపజాతి
| | ఈయింద్రవజ్రాఖ్య ముపేంద్రవజ్ర-శ్రయంబు గాఁగా నుపజాతి యయ్యెన్. | |
తోదకముఁ (భభభగగ, 7.)
| | కామితఛత్రయగాయుత మైవి- శ్రామపుఁదోదకసంజ్ఞతఁ జెందున్. | |
రథోద్ధతము (రసరలగ,7.)
| | రక్తిఁ బేర్చి రనరంబుపై లగం-బుక్త మైనను రధోద్ధతం బగున్. | |
చంద్రిక (ననరవ, 7.)
| | సలలితముఁ జెంద్రికాహ్వయం-బలరు ననర వాంక మై కృతిన్. | |
స్వాగతము (రసభగగ,7)
| | స్వాగతంబు రనభంబు గ గార్తన్ - సాగువిశ్వనృపచంద్రకులాఢ్యా. | |
శ్యేని (రవరవ, 7.)
| | శ్యేనికై రవంబు చెప్పి పైరవం బూనఁ జేయు టెల్ల నొప్పు నెప్పుడున్. | |
వాతోర్మి (మభతలగ, 7.)
| | తద్వాతోర్మిన్ మభ తంబుల్ లగమున్ - సద్విశ్రామస్థితి సంధిల్లుఁ దగన్. | |
జగతీఛందఃపాదంబు ద్వాదశాక్షరం బై
భుజంగప్రయాతవృత్తము (యయయయ, 8.)
| | భుజంగప్రయాతంబు పొం దారు నందం | |
తోటకము (సససస, 9.)
| | సరసం బయి సానససంభృత మై విరచించినఁ దోటకవృత్త మగున్. | |
వంశస్థము (జతజర, 8)
| | జలంబులం జెంది నజంబు రేఫయున్ - సుతింప వంశస్థ మనుక్రమక్రియన్. | |
ఇంద్రవంశము (తతజర, 8.)
| | ఈతాజిరాకల్పన నింద్రవంశకా-ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా. | |
తోదకము (పజజయ, 8)
| | సలలిత మైననజాయగణంబుల్ - విలసితతోదకవృత్తముఁ జెప్పన్. | |