పుట:కామకళానిధి.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

వీనిలోఁ జిరపాతంబు మధ్యమపాతంబు, శీఘ్రపా
తంబున నరేతఃపాతంబులు మూఁడువిధంబులు. చండవేగంబు,
మధ్యమవేగంబు, మందవేగంబు నన తద్వేగంబులు ముత్తెఱఁగు
లు. చిరక్రియయు, మధ్యమక్రియయు, లఘుక్రియయు నని యా
క్రియలును త్రివిధంబులు. నివి యొకటొకటి గూడ సప్తవింశతి
భేదంబు లయ్యెను.


గీ.

చండవేగమైనఁ జాలఁగా ద్రవియించు
మిగులనొడలు విరుచు తగుల మధిక
ముగ జనించు మందమగువేగమున విప
రీతమిదియు శాస్త్రరీతి తలప.


క.

మధ్యమవేగంబునఁ గా
మధ్యమముగఁ గామమోహమహిమలు గలుగున్
బుద్ధ్యాప్తి నెఱిగి సురతం
బధ్యాసింపంగవలయు నతిమోదమునన్.


వ.

కావునఁ బురుషనారీప్రమాణంబు లెఱింగి వాతపైత్య
శ్లేష్మప్రకృతులును, గంధర్వాది సత్వంబులును జాతులును
నభ్యాసకాది భేదంబులును ప్రీతులును దేశధర్మంబులును దేహ
సామ్యంబులును దత్తజ్జాతులకుఁ దత్తద్దివసంబులును గళ లుండు
జీవనరంబులును నెఱింగి కామాంకుశ కరికరాది గుహ్యోపచా