పుట:కామకళానిధి.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ణాదులతోఁ దత్తత్తిథులఁ దత్తత్స్థానంబుననే చాలుఁ గళో
యంబగు. ఇది శ్రీనాథకవి మొదలైనవారి కనుభూతంబు.
ఇంక గోణికాపుత్రమతంబు నెఱింగించెదను.


క.

శిరమును బాదము దక్షిణ
కరమును జనుగవయుఁ దొడలు ఘననాభియు నా
మరునిలు నురుజఘనముఁ గటి
మురువుగల్గు విపులకక్షములు జఘనంబుల్.


గీ.

శుక్లపక్షమందు సొరిదిగాఁ బాడ్యమి
యాదిగాఁగ జఘన మాదిసేసి
మరుఁడు మీదికెగయు మంత్రకంబుల నాలు
బిందుయుతము లగుచుఁ బెంపుఁజెందు.


గీ.

అగ్నికణములట్ల ధ్యానంబు గావించి
యంగసంఖ్యయైన యక్షరంబు
మునుపు జెప్పినట్లు కనుల నావేశించి
యవలఁ గళలనంట నమరునండ్రు.


వ.

ఇంక వాత్స్యాయనమతం బెఱింగించెద.