పుట:కామకళానిధి.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యరవిందమాదియౌ నస్త్రపంచకమున
                     కాధారమంత్రంబు లగుచునుండు
నీయస్త్రముల నరుఁ డీక్షణంబుల రెంట
                     గూర్చి యగ్నిప్రభ జేర్చి మదిని
ధ్యానంబు గావించి తగబ్రయోగించి యా
                     వల శశికళ నంటవలయు నండ్రు
వరుస నీయస్త్రముల నేయ వనితయొడల
స్థానము లెఱుంగవలయు నిశ్చయము హృదయ
కుచనయనగుహ్యకక్షముల్ గొమరుగాఁగ
....................................................


వ.

ఆ సిద్ధమంత్రంబు దనకన్నులను, వింటియందును
గూర్చి యగ్నికణాకారముగఁ బ్రయోగించవలయు. ‘ఐం’ అను
మంత్రము నట్లే కుచములను, ‘అం’ అనుదాని గన్నులను,
‘ఇం’ అనుదానిని శిరమునను, ‘ఉం’ ఆనుదానిని మదనమందిర
మునను బ్రయోగించి యగ్నికణములవలె నాస్థానములయందు
నాటినయట్లు భావనజేసి చంద్రకళను స్థానమెఱిగి పట్టవలయును.
ఈ మంత్రము లైదును అక్షరలక్షంబు జపంబు సేసి తద్దశాం
శంబు క్షీరంబుల నర్ఘ్యంబును, తద్దశాంశంబు ఘృతంబున హో
మంబును, తద్దశాంశంబు బ్రాహ్మణభోజనంబును జేయ మంత్రం
బులు వశంబులు. ఆమంత్రములం దొకటి యభిమంత్రించి తృ