పుట:కామకళానిధి.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మలయసౌవీరదేశకాంతలకును నిదియలక్షణము.


గీ.

దుష్టమతులు మిగులధూర్తులు కోపనల్
చండసురతవాంఛ జరుగువారు
నఖము లుంచఁ గళలు నటియించుకొనరు కాం
భోజపాండ్యదేశరాజముఖులు.


గీ.

మిగుల కొంచము సురతంబు మేను వెగటు
చుంబనాలింగనమ్ముల సోలలేరు
వలచినప్పుడె కామించి వత్తు రింతె
తెలియఁ గాశ్మీరగాంధారదేశసతులు.


వ.

పర్వతప్రాంతముల నుండువారికి నిదియ లక్షణము.
ఇంక జంద్రకళాలక్షణం బెఱింగించెద. ఈ చంద్రకళాస్వరూ
పంబు నందికేశ్వర శ్వేతకేతు పాంచాల కుదంతక చారా
యణ శరసువర్ణనాభ ఘోటకముఖ గోవర్ధగోణికాపుత్ర కూచి
మార వాత్స్యాయ నౌద్దాలిక బాభ్రవ్యప్రభృతులు తేట
పడ నెఱింగించిరి. వారిమతంబులు సంగ్రహంబున వచియించి
వర్ణించెదను. అందు నందికేశ్వరమతము ననుసరించి సర్వస్త్రీ
సాధారణమైన చంద్రకళ వివరించెద.


సీ.

శుక్లపక్షమునందు నుదతుల కెల్లను
                     కుడిపార్శ్వమున నుండి కొమరు మిగులు