పుట:కామకళానిధి.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కర్ణముల్ ముఖమును గళమును పొడవులు
                     కోమల మంగంబు కుచయుగంబు
పిఱుఁదులు గొప్పలు విరుదలఫలకవి
                     స్తారమైయుండు గంభీరనాభి
గొప్పచెవులును నుదరంబు గొంచ మగును
పొందు గల్గిన భుజములు భోజనంబు
నిదుర మిక్కిలి కోపంబు నిండ గలిగి
మనసు చలనంబు గల్గిన మగువ బడబ.


గీ.

పాణిపాదంబు లెర్రని పద్మ మటుల
మరునియిల్లు నవాంగుళపరిమితంబు
తేనెవాసన రతివారి తెలియతడవు
గా ద్రవించును బడబాఖ్య కాంత కరయ.


సీ.

కంఠంబు చెక్కులు కర్ణంబు నాసిక
                     తోరంబులైయుండు తొట్రుపెదవి
పచ్చనికన్నులు బలుగట్టికణుపులు
                     గల్గినవేళ్ళు వక్రమ్ము లయ్యు
కురుచలై దళములౌ కురులును స్థూలముల్
                     కాళ్ళు చేతులును తీక్ష్ణములు దంత
పంక్తులు మైచాయ బహువిధంబులు చన్ను
                     గవతోర మధికరూక్షస్వరంబు