పుట:కామకళానిధి.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కూడి క్రీడింపవలయు నిక్కోమలాంగి
సులభముగ సాధ్యయగుఁగాన నుదతులందు
నుత్తమ యటంచుఁ బల్కుదు రుర్వియందు
గరిమఁ గామకళావిద ల్గురుతెఱింగి.


వ.

పైత్యప్రకృతి లక్షణ మెట్లనిన.


సీ.

గౌరవర్ణము మేనుఁ కనుఁగవ కొనలును
                     అరచేతు లరకాళ్ళు నరుణము లగు
గోరులు దంతముల్ గొంచెము రక్తముల్
                     కుచములు పిఱుఁదులు గొప్ప లగుచు
బలిసియుండును మేనఁ గల్గిన చెమ్మట
                     వెగటువాసన గల్గి వెలసియుండు
మమత మిక్కిలి గాన మరునిల్ సుఖోష్ణమై
                     చేయు సోఁకినయంతఁ జెమ్మగిల్లుఁ
జాలఁగాసికిఁ దాళదు చంచలించు
క్షణము కోపము ముదమును క్షణమై యుండు
నంగనలయందు మధ్యమ యనఁగ నొప్పు
వసుధఁ బైత్యప్రకృతి యగు వామనయన.


వ.

వాతప్రకృతి లక్షణ మెట్లనిన.


సీ.

అతినీలవర్ణమునైన ధూసరవర్ణ
                     మైనఁ గల్గినమేను నవయవమ్ము