సరసవిబుధగేయా సత్యభాషావిధేయా నరవరమణిపూజ్యా నవ్యయోగాంతరాజ్యా సురుచిరతరమూర్తీ సూరిసంస్తుత్యకీర్తీ దరహసనవిలాసా దానలక్ష్మీవిలాసా.
ఇది శ్రీ గురుచరణారవిందమిళిందమాన నెల్లూరి వీరరాఘవామాత్యతనూభవ సూరమాంబాగర్భశుక్తిముక్తా ఫల సంస్కృతాంధ్రసాహిత్యసామ్రాజ్యసార్వభౌమ శివరామ నామప్రణీతంబైన కామకళానిధియను కామశాస్త్రంబునందు బ్రథమాశ్వాసము.