ఘనము పాదములు దీర్ఘములు దట్టమ్ములై తనువును శిరమునుఁ దగు కచములు లోవంపుదేహము భావింప స్థూలంబునై క్రాఁగుచుండు నేయవసరమున ఘుర్ఘరస్వరంబు కుత్తుకనడకయు భూమి యదర వేగముగఁ జరించు కుటిలమైనచూపు క్రూరమైన మనంబు కొండెములనె పల్కుచుండు నెపుడు.
సంభోగమునఁ బ్రీతి చాలఁ గల్గిన యది నెలవంకగుంపులు నిండఁగోరు కోరికల్ మిక్కిలి కోరు నెఱ్ఱనిపూవు లెఱ్ఱనివస్త్రము లిచ్ఛయించు పచ్చవర్ణం బొండె హెచ్చు ధూసరకాంతి యొండె కల్గినది రెండొండె ప్రకృతి దయలేనియది మట్టి తలఁప భోజనము ద్ర వము లేకుండు దర్పకునియిల్లు అచటిరసమును కాక్షారమయ్యు నెగటు గంధమును గల్గి యుండుఁ దాఁ గరగెనేని వేగమే ప్రీతిఁ జెందు నివ్విధము గలది శంఖినీకాంత కామశాస్త్రంబునందు.