రమణీయచరితయౌ రాజకుమారాంబ యందు నేకోజి ధరాధినాథు వరరూపయగు నుమాబాయియందు గుణాఢ్యు డైన ప్రతాపసింగావనీంద్రుఁ గాంచి నాల్గుభుజమ్ముల ఘనత గాంచు శ్రీమహావిష్ణుకైవడిఁ జెలఁగు నతఁడు సేతుపతి గర్వహరణ ప్రసిద్ధికీర్తి చారుతరమూర్తి తులజరాట్చక్రవర్తి.
ఆ రాకొమరులయందు ను దారయశోమహిమ వెలయు నాహవవిజయా ధారుడగు హరిశ్చంద్ర ధ రారమణుడు సూర్యవంశరత్న మ్మనఁగన్.
పాండ్యకేరళరాజభామినీకచభార కల్హారములకాంతిఁ గాకుపరచి కరహాటకురులాటకర్నాటకామినీ కుంకుమరేఖల సుంక మడిగి ద్రవిడకరూశవిదర్భమద్రాంగనా వీటికారుచులకు వెరపు జూపి కుంతలనిషధాంధ్రకాంతాకుచద్వయీ గోరోచనాచ్ఛవి మారుపఱచి