పుట:కామకళానిధి.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాంగియు, కుమారికయును వర్జింపబడుదురని వాత్స్యాయానా
దులు సెప్పిరి. కాన నెరింగి సమయోచితంబుగ గ్రీడింపవలయును.


క.

కాముకులకు బ్రీతికరం
బై మురువై భోగయోగ్యమై యీకృతి
............చంద్రదారక
మై మెరయు త్రిలింగకవులు నభిమతి సేయన్.


?.

పయోజనేత్రాజనపంచబాణా
నయాదివిద్యాకలనప్రదీపా
భయార్తరక్షాంతకృపాధురీణా
శయా బుజాతోద్ధృతసత్కృపాణా.


పంచచామరము.

కరాకరాజవృత్తవైరి కాండభిన్నభాస్కరా
ధరాధరాధరోపమాన ధైర్యధుర్యమానసా
సురాసురాదిలోకవంద్య సూరిగేయసద్యశా
చరాచరానుకూలధర్మ సారభృత్ప్రచారణా.


మాలిని.

సలలితగుణజాలా సత్కృతానందలోలా
విలసితబహులీలా నినస్ఫురద్దానశీలా
అలఘుమతవిశాలా హారికీర్తయాలవాలా
చలితవిమతసాలా సత్యవాక్యానుకూలా.

గద్య. ఇది శ్రీ గురుచరణారవిందమిళిందాయమానమానస
నెల్లూరి వీరరాఘవామాత్యతనూభవ సూరమాంబాకుమార
సంస్కృతాంధ్రసాహిత్యలక్షణసార్వభౌమ శివరామనామ
ప్రణీతంబైన కామకళానిధియను కామశాస్త్రంబునందు
సర్వంబును చతుర్థాశ్వాసము.