పుట:కామకళానిధి.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఒకపార్శ్వంబున శయ్యమీఁద సతి పన్నుండినన్ విబుధామహీ
ళకు ముందై పవళించి యొక్కపదమున్ లాగించి స్వోరస్థలిన్
సుకరంబై తగసెజ్జ రెండవది యచ్చో నిల్పి క్రీడింప వే
ణుకసంజ్ఞంబగు ప్రౌఢకాంత కిది చెన్నొందున్ గళాధుర్యమై.


చ.

ఎదురెదురై సతీపతుల హీనముదంబున బవ్వళించి యా
నుదతి పదద్వయంబురము సోఁకగ నిల్పి కటీతటి న్ముదం
బొదవగ గౌఁగలించి యల యుగ్మలి నైజగళంబు గౌఁగిటన్
నదియ బిగించి గూడునది ఖ్యాతమగున్ ధర గుక్కుటాఖ్యమై.


చ.

సతి యొకప్రక్కవాటుగను శయ్యపయిన్ బవళించియుండగా
నతివ నిజోరుమధ్యమున నడ్డముగాఁ బవళించియుండగా
బొతికిలబెట్టి యొక్కటి మరొక్కటి మేనిపయిం ఘటించి స
మ్మతి రతి జేయ జెల్వుగను మానితబంధ మనన్ వసుంధరన్.


వ.

ఇంక స్థితబంధంబులు: అవియు నెట్లనిన యుగపదం
బును వితర్దితంబును మార్కటంబును ఘట్టితంబును సమ్ముఖీ
కరణంబును ప్రస్ఫుటంబును నుద్గ్రీవంబును జాఘనంబు నన నె
న్మిది భేదంబు లగు తల్లక్షణం బెట్లనిన.