పుట:కామకళానిధి.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

జలజదళాక్షి పాదములు చక్కగ రెండును గూర్చి సాచి పూ
తలిమమునన్ బరుండి ప్రమదమ్మున బైకొని యమ్మురారి బో
ర్గిల బవళించియుండ మృదురీతిగ నూరువులం దదీయని
శ్చలమదనధ్వజంబు సరసన్ బిగియించిన బీడితం బగున్.


వ.

ఇది శశజాతిస్త్రీకిని తురంగజాతిపురుషునికి నైనది.


మ.

అలరుంబోడి నిజోరుకాండములపై యాత్మోరువు ల్చుట్టి ని
శ్చలతన్ మేన్ బిగియార గౌఁగిటను జేర్చున్ శౌరియున్ మోహ మ
గ్గల మైగ్రమ్మక మీద వ్రాలి ధర మోకా ళ్ళుంచి మో వానుచున్
గళలం బట్టుచు గూడ వేష్టితసమాఖ్యంబైన బంధం బగున్.


వ.

ఇది బడబావృషభుల కైనది.


మ.

తరుణాలోకశిఖావతంసముఖరద్వంద్వమ్ముచే నూరువుల్
సరిగా రెండును గూర్చి పట్టుకొని లీలాహసము ల్మీరగా
విరసెజ్జన్ బవళించియుండ హరి పృథ్విన్ గొంతుగూర్చుండి
వెన్కన్ రమియించగా నిదియు దా నుద్భగ్నబంధం బగున్.


వ.

ఇది కరిణీవృషభుల కైనది.


చ.

వనిత నిజోరుకాండములు వరుసుగ రెండును గూర్చి నా
ధునియురమందు నుంచిన మృదుక్రియ వానిపయిం బరుండి య
.............రెండుమూపులు కరాబ్జయుగమ్మున బట్టి లాఘవ
మ్మున మురవైరి గూడ నిది భూమి న్నుస్ఫుటబంధమై చనున్.