88 కవిరాక్షసీయము. అతనుం టీ, ఆగ్రేఇముంగల, భూభృత = రాజుయొక్క, కన్యాం పడుచును, దృష్ట్వా చూచి, శ్రమస్థోZసి=కామాదులు లేనివాఁడైనను, కామం=అభిలాషను, ఎక్కువగా, ఆతన్వక్ = చేయువాఁడై, వికారవాక్ ని మోహముగలవాఁడు, నష్టాలే. నష్ట=నాశమైన, ఆత్మాఉబుద్ధిగలవాఁడని, బుధై & విద్వాంసులచేత, ఉచ్యతే - చెప్పఁ బడుచున్నాఁడు, ఆర్థాంతరము. ఆస్ట్రే=ఎదుట, భూభృతః=మంచుకొండయొక్క, కన్యాం - కూఁతురైనఉమాదేవిని, దృష్ట్వా = చూచి, శమస్థో ఒపీ కామాది రహితుఁడై తపంబొనర్చు వాఁడైనను, కామం=మన్మథుని, అతనుం శరీరము లేనివానిగా, ఆతన్వర్ = చేసిన హఁడై, మనోవికారముగల ఈశ్వరుఁడు, బుధైకి ఈశ్వరుఁడు, బుధైకి - పండితులచే, లేక దేవతల చేత, అష్టాత్తా - అష్ట=ఎనిమిది విధములైన, ఆత్మా= శరీరములు గలవాఁడు, ఇతి= ఇట్లని, ఉచ్యతే=చెప్పఁబడుచున్నాఁడు. తా. ఇంద్రియములను నిగ్రహించి కామక్రోధాదులను మాసినవాఁడైనను, తన మురిగలనున్న రాజకుమారికనుగాంచి కామమోహితుఁడై వికారముగలవాఁడయ్యె నేని యట్టివానిని విద్వాంసులు బుద్ధిలేనివానిగాఁ దెలియుచున్నారు. . దక్షిణామూర్తియై హిమవత్పర్వతమున యోగనిష్ఠ చేనుండి తనకపకారమొనర్చిన మన్మథుని ఫాలనేత్రాగ్ని చే దహించి సిదప రతీదేవి ప్రార్థనచే నామదనునకు శరీరము లేకయే ప్రాణంబొసంగి తనముంగల మెలంగు హిమవత్పర్వత కుమారికయైన పార్వతిని గాంచి వికారమును బొందినవాఁడైన శివునిని దేవతలును వ్యాసాది విద్వాంసులును అష్ట మూర్తి యనిచెప్పుచున్నారు. ఆనఁగా: “శ్లో. భూతార్క చన్ద్రయజ్వానో మూర్త యోఒష్టా ప్రకీర్తితాః." వృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుఁడు, సూర్యుఁడు, యజ్ఞము చేయువాఁడు. అసునివి. తం ప్రభుం ప్రాప్య విశ్వస్య రతిః కథ మివోల్ల సేత్, క్రోధజ్వలితయా దృష్ట్యా యేన కామో నిహన్యతే.. ساس వ్యా. కమితి. విశ్వస్య లోకస్య ప్రభుం తం ప్రసిద్ధం రాజాదికం ప్రాప్య యాచకజనస్య రతిః ప్రీతిః కథ మివ ఉల్ల సేత్, అర్థ్యేత నేత్యర్థః. తత్ర హేతుః, యేన రాజాది కేన కర్తా ధేన లోభ హేతుకేన జ్వలితయా ఉగ్రయా దృష్ట్యా కర ణేన ఆత్త్యాభిలషితం. కార్యం నిహన్యతే వ్యర్థి క్రియతే శ్రద్ధం లుబ్ధం ప్రభు మాసాద్య ఆర్థినాం న ప్రీతి రుజే తీత్యర్థంః.. ఆన్యో ఒవ్యర్థః విశ్వస్య జగతః ప్రభుం స్వామినం తం ప్రసిద్ధం త్రిలోచనం
పుట:కవిరాక్షసీయము.pdf/86
స్వరూపం