50 కవిరాక్షసీయము, ఆర్థాంతరము. సర్వాః = సమ స్తమైన, ప్రజాః=(భూమియందుగల) ప్రజలను, ఆధఃకుర్వన్ = క్రిందుచేయుచు, అనఁగా తాను మింటనుండుటచే జనులను క్రిందుగాఁ జేయుచు, బహుధా మహిమోల్బణః_బహు = అనేకములైన యోవధులు మొదలగువానికి, ధామ ఆశ్రయమైన, హిమజమంచుచేత, ఉల్బణః= ఎక్కువైనట్టి, రాజా = చంద్రుఁడు, శస్మింశ్చిత్ = ఒకానొక, సర్వణి = పూర్ణిమా ప్రతిజత్సంధియందు, అహిభయాకులకి అహి = సర్పాకారుఁడైన రాహువు వలన, భయ = భీతిచేత, ఆకులః = చింతగలవాఁడు, భవేత్ అగును. = తా, భూలోకమందు గల జనుల నందఱను క్రిందుగానుండునట్లు చేసి నింగిని వెలుంగుచుండు చంద్రుఁడు ఒకానొక పర్వకాలమున రాహుగ్రహముచే గ్రసింపఁబడు నట్లు, తనబాహుబలిమిచే జనులనందలను ధిక్కరించియుండురాజు, ఒకానోక కాల మందు రాష్ట్రములోఁగలిగిన కలత చేత చిక్కువడును. శ్లో. "హిరణ్య ధాన్య వస్త్రాణి వాహనాని తథైవచ, తథాస్యేద్రవ్య నిచయా ప్రజాత స్సంభవన్తిహి, వార్తాం ప్రసా ధయేన్నిత్యం వార్తాపై లోక సంశ్రీయః, ప్రజాయం వ్యసనస్థాయాం వక్చిదపి సిద్ధ్య త.” అని శామందకము. బంగారు, ధాన్యము, వస్త్రములు, వాహనములు మొద లగునవియన్నియు రాజునకుఁ బ్రజలవలననే కలుగుచున్న విగాన యట్టి ప్రజలు విరక్తులై నచో రాజునకు తొందర గలుగుననియు నట్టి ప్రజలను రాజు చక్కఁగా పొలించవలయు ననియును భావము. శ్లో. మహతా కరపాతేన సర్వం వసుమతాం హరన్, · సంపూర్ణ ప్యళ్ను తే రాజా కలాయాః క్షయ మన్వహమ్. ర వ్యా,—మహతేతి, సంపూర్ణ 2.పి కోశాదిభిరితి శేషః రాజా నృపః మహతా సంపూర్ణోZపి_కోళాదిభిరితి ఆమర్యాదన కరపాతేన శుల్కాది భాగధేయ కల్పనయా హేతునా. ని. 'భాగధేయః కరో బలి రిత్యమరః-వసుమతాం ధనినాం, ని. 'వసు ర్మయూఖాగ్ని ధనాభిధేయే' ష్విత్య మరః, సర్వం ధనం ఆహర ఆస్వహం ప్రత్యహం, విభక్త్యర్థే వ్యయీభావః . ' నపుంసక స్యాదన్య తరస్యా 'మితీ టచ్ ప్రత్యయ స్సమాసాంతః. కళయా విత్తవృద్ధ్యా.ని. “కళా శిల్పే వి తవృద్ధ్యాంచంద్రాంశే శక లేక లే”త్యమరః. క్షయం నాశం అశ్నుతే ప్రాప్నోతి. ప్రకృతిమూలత్వా రాజపద స్యేతి భావః. ఆన్యో వ్యర్థః, మహతాకరపా తేనకిరణ ప్రసారణేన హేతునా వసుమతం తేజ స్వినాం ధౌమాదీనాం సర్వం లేదో హర స్నాచ్ఛాదయక్ రాజా చంద్రః అన్వహం కలయా స్వతేజోంశీన క్షయం అన్న తే క్షీణో భవతి. క్రమేణ దేవైః పీయమానత్వా దితి భావళి.
పుట:కవిరాక్షసీయము.pdf/48
స్వరూపం