ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రకాశిక
ఈ పండ్లతోట కవికోఠీల దువ్వూరి రామిరెడ్డిగారి కట్టకడపటి రచన ఇది సాదీమహా కవి “బోస్తాను” అను పార్శీకావ్యమునకు అనువాదము.
సాదిమహాకవి "గులిస్తావా" ఆను పార్శికావ్యమునకు, రెడ్డిగారి అను వాదము గు లా బి తోటను యిదివరకే ప్రచురించి ఆంధ్రమహాజనులకు అందించితిమి,
రెడ్డిగారి రచనలలో తుదిరచనయైన ఈ పండ్లతోట అసంపూర్ణముగా నిలిచిపోయినది.
అయినా, దేనికవే చిన్నచిన్న కధలతోనున్న యీ కావ్యము, అసం పూర్ణమైనా, సహృదయుల రసాస్వాదనమునకు ఆటంకము గలుగదు,
ఆలస్యంగానైనా, రెడ్డిగారి పండ్లతోటను ఆంధ్ర పాఠకలోకానికి ఆందించగలిగినందులకు గర్విస్తున్నాము.
మా ఈ కృషికి, అంధ్రమహాజనుల ఆదరాభిమానాలు నదావుండ గలవని ఆశిస్తున్నాము
ప్రకాశకులు.