పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కళాపూర్ణోదయము

   
   నన నిది నెపముగాను నిధీశసుతుని దా
               రంభ యై కూడుట రమణికోర్కె
   యదియు మదీయ కార్యానుకూలమ కదా
               యని యాత్మ నలరి యాయతివఁ జూచి

గీ. ఉవిద నీ కిట్టిసామర్థ్య మొదవుటకును
   వర మొసంగితి నేను నీవలసినట్టి
   యంగనలరూపుఁ దాల్చి యాయబ్జనాభు
   వనితలతలంపుఁ దెలిసి రమ్మనుచుఁ బనిచె. 46

సీ. పనిచిన నాచెల్వ వనజదళాక్షుని
                సతులపాలికిని దత్సఖులరూపు
   ధరియించి వార లొద్దను లేనివేళలఁ
                జని ప్రసంగము దెచ్చి సంయమీంద్రు
   సంగీతచాతుర్యభంగు లనన్యసా
                ధారణం బగుట తద్వాక్యసరణి
   చేత నెంతయు సునిశ్చితముగాఁ దెలిసి య
                మ్ముని కది యెఱిఁగించి ముదితుఁ జేసె

గీ. సంయమియు నాయకం జూచి జాంబవతియు
   సత్యభామయు భోజాత్మజయును హరియు
   గురువులుగఁ గానకళ లెల్ల గరిడిముచ్చు
   దనముతో నేర్చితివి గద యనుచుఁ బలికి. 47