పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కళాపూర్ణోదయము

క. అమ్ముగురకు గానము హరి
   యిమ్మెయి నఖిలంబు నేరి యిఁక మిసంగీ
   తమ్మునకు నీడు లేదు జ

   గమ్ముల నని పలికి మోదగరిమం దేల్చెన్.

38



ఆ. అంతిపురములోని కరిగినప్పుడు తదీ
    యాంగనలును దత్ప్రసంగ మైన
    మౌనితోడ నీదు గానవిద్యకు సరి

    లే దటంచుఁ బలికి రాదరమున.

39



వ. అంత.

40



క. మణికంధరుఁడును గలభా
   షిణియుఁ గొలిచి రాఁగ నాఋషిప్రవరశిఖా
   మణి యొక్కనాఁడు యదుభూ

   షణు వీడ్కొని వేడ్క నవని సంచారమునన్.

41



ఆ. చనుచునుండి తనదుసంగీతచాతురి
    గరిమపసకు మున్ను సరసిజాక్షు
    చెలువ లాత్మ మెచ్చి సలిపినయట్టిప్ర

    శంసచందములప్రసంగ మైన.

42



వ. వారితో నిట్లనియె నివ్విధంబున నవ్వరవర్ణినులు మువ్వురుం
    బెక్కుమాఱులు మదీయసంగీతచాతుర్యంబురీతులతినూత
    నంబు లనియు నీ తెఱంగు లెవ్వరికిని దొరక వనియు బలు