పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

కళాపూర్ణోదయము

   
    వివిధంబు లగుచిత్రవిరచనలును దసి
                      లీనూలిపట్టెయల్లికబెడంగుఁ
    బలుదెఱంగులపట్టుతలగడబిల్లలు
                      మవ్వంపుఁగుంకుమపువ్వుపఱపుఁ

గీ. గలిగి మెఱుఁగులు దిక్కులఁ గడలుకొనఁగ
    మించుదంతపుటుయ్యెలమంచమునను
    బొలుపుమీఱుచుఁ దనయంతిపురముసతుల
    యూడిగంబులు గైకొంచు నున్న శౌరి.

ఉ. అప్పలుకు ల్చెవింబడినయంతన దిగ్గున లేచి యె ట్టెటూ
    యప్పరమేష్ఠినందనుఁడె యౌనె హజారపుఁద్రోవ వచ్చెనే
    యెప్పుడు సంతరిక్షగతి నిచ్చటికే చనుదెంచు నివ్విధం
    బిప్పుడుచాలఁజిత్రమిదియేమొకొయంచుససంభ్రమంబునన్

సీ. తూగుటుయ్యేలఁ దూఁగుచోఁ గొంత చెదరిన
                     యరవిరివన్నెబా గట్ల యుండ
    నడపంబుతొయ్యలి మడిఁచి యిచ్చినతెల
                     నాకుఁజీలిక చేతియంద యుండ
    నట్టిటు దొడిగినయంఘ్రుల రత్నంపు
                     సమ్మాళిగలు సారె జాఱుచుండ
    రాణివాసపుఁజామరగ్రాహిణులు గూడ
                     నరుగుదెంచి తమంత మరలుచుండ