పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యభిప్రాయము. కాని కేవలాంధ్ర పదకదంబమునకంటె సంస్కృ తమిళితము లగు తెలుఁగునుడులపలుకుబడి శ్రుతిలీన మగుగాన నినదము కైవడి వీనులకు నిుపు జనింపఁ జేయు ననుటకు సంది యము లేదు. సంస్కృతకృతులయందలిఘనతను బాగుగ నెటిఁ గిననన్న యభట్టారకాదిపండితకవితల్లజులు దెలుఁగు నుడికారం పుసొంపులకుఁ బరవశులై తెలుఁగునాఁటిమాటల పూదోటల లో లలితమోహనము లగుత్రిలింగ సాహితీకృతిలతికల మొలక లెత్తించిరి.

మున్ను నన్నయనాఁట నాంధ్రకవితావసుంధరను నాఁ టఁబడినయీ తెలుఁగు లేఁ గౌతతీఁగియ నానాఁటికి విరివిగఁ 'బ రిఁగి మహదామోదసుందరము లగుసాహితీసుమమంజరుల వెల్లివిరియఁ జేసినది. ఈరీతి లలితకవితావ్రతతీ ప్రసూనసౌరభము లతో నలరారు నాంధ్రసాహిత్యో ద్యానవాటికను బింగళి సూర నార్యునికవితావల్లరి మల్లె లీవియచందాన నన్ని విధముల మిన్న గా నెన్నికఁ గాంచియున్నది.

ఈకవితల్లజుఁ డనే కామూల్య కావ్యముల వీరచించియు న్నాడు. కాని నేఁడు మనకందోయికి విం దొసంగుచున్న పసం దుఁగబ్బములు “రాఘవపాండవీయ” "కళాపూగోదయ” "ప్రభావతీ ప్రద్యుమ్న " ములు మాత్రమే. వీనియం దాద్యంతములు పురాణేతివృత్త శోభితములు. నడిమిక బ్బ మన్న నో చిత్త హరము లగుకొంగొత్త కతలవిన్నాణములతో నల రారుచున్నది. పెక్కు పలుకు లేల? తెలుఁగు బాసలో నిదివటి కిట్టి ప్రశస్త వస్తుసుందర మగుపుస్తక ముదయించి యుండ లేదు.