పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కళాపూర్ణోదయము

గీ. అమర నుపమాదులును యమకాదులు నగు
   నట్టియర్థశబ్దాలంక్రియలు ఘటించి
   కవితఁ జెప్పంగ నేర్చు సత్కవివరునకు
   వాంఛితార్ధంబు లొసఁగనివారు గలరె. 188
 
లయ. చలువ గలవెన్నెలల చెలువునకు సౌరభము
             గలిగినను సౌరభముఁ జలువయుఁ దలిర్పం
      బొలు పెసఁగుకప్పురపుఁబలుకులకుఁ గోమలత
             నెలకొనిన సౌరభముఁ జలువపసయుం గో
      మలతయును గలిగి జగముల మిగులఁ బెంపెసఁగు
             మలయపవనంపుఁగొదమలకు మధురత్వం
      బలవడిన నీడు మఱి కల దగఁగవచ్చుఁ గడు
             వెలయఁగలయీసుకవిపలుకులకు నెంచన్. 189

వ. కావున. 190

క. ఊరక యటు మిముబోఁటుల
   చేరువఁ జరియింపఁగనిన సిద్ధింపవె యే
   కోరిక లైన నజస్రముఁ
   గోరుదు మీవీణ మోచుకొని కొల్చుటకున్. 191

సీ. మునినాధ యిటమున్ను వనజదళాక్షుని
                   యంతఃపురంబున కరుగువేళ
    మణికంధరుని దదంగణమున నిల్పి మీ
                   వీణియ మీరలే పొణిఁ బూని