పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

కళాపూర్ణోదయము

క. నావుడు నంతటిరూప
   శ్రీ వైభవవతికిఁ గాక సిద్ధించునె యా
   దై వనియుక్తియు మాబోం
   ట్లేవిధమునఁ బాట్లఁ బడిన నిద్ధవివేకా. 181

గీ. అనుడు నామాట కేమి యోయంబుజాక్షి
   రంభ మొదలైన యేయచ్చరలకు నైనఁ
   దక్కువే నీదురూపసౌందర్యమహిమ
   లెక్కుడే కాక మిగుల నూహించి చూడ.182

ఆ. అది యటుండనిమ్ము ముదిత నిన్నును జూచి
    నట్లు దోఁచుచున్న యది యొకింత
    నలిననాభుకొలువునకు వత్తువొ యన
    వత్తు మిమ్ముఁ జూతు వరమునీంద్ర. 183

సీ. అని యింతి పల్కిన మునిపలె నవునవు
                  నెలఁత ని న్నె ఱుగుదుఁ దలఁచుకొంటి
   మాశిష్యుఁ డై నయీమణికంధరాహ్వయుఁ
                  డిట గొన్నినాళ్ల క్రిందటను గ్రొత్త
   గాఁగ హరిం బొడగానంగఁ దా వచ్చి
                  దండకరూపసంస్తవనరచన
   యొనరింప నేక సంధన గ్రహించి పఠించి
                  నట్టి నేర్పరివిగదమ్మ నీవు