పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43

ప్రధమాశ్వాసము

క. నీ వెట్లెఱిగితి చెపుమా
   నావుడు మీరాడుకొన వినంబడుమాటల్
   భావింప నట్ల యై నా
   భావమునకుఁ దోఁచె ననుచు భామిని పలికెన్. 176

చ. పలికిన మింట నాడుకొనుపల్కులు వింటివొయన్న వింటినో
    యలఘుతపోనిధాన తనయత్యధికం బగురూపసంపదం
    జెలువుఁడు కైవసం బనుచుఁ జెల్లుఁబడిం బచరించి పల్కె నా
    కలికి తదుక్తి కోర్వమి ప్రకాశిత మయ్యెను మీవచస్థ్సితిన్ . 177

క. అనుటయు ముని నాయకుఁ డో
   వనితా యొ ట్లోర్వవచ్చు వలవనిగర్వం
   బునఁ గన్ను గాన కాడెడి
   యనుచిత వాక్యంబు లేరికై నఁ దలంపన్. 178

క. తరుణీ యేరికిఁ జెల్లునె
   యరయఁగ నే మింతవార మనుకొన నిదిగోఁ
   బిరువీకుగ నున్నది తాఁ
   గర మద్భుత మైనసవతికయ్యము చేతన్ 179

క. సవతి యన నింక నొకతెన్
   భువిలోపల వేఱ వెదకఁ బోవలయునె యో
   ధవళాక్షి నీవ కానే
   రవె దైవనియుక్తిఁ గొంత ప్రాప్తి గలిగినన్. 180