పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

కళాపూర్ణోదయము

   
    బోలు మన మితనిఁ గని యుచి
    తాలాపము లాడి చనుట యభిమత మనియేన్. 154

ఉ. నారదుఁడుం దదీయవచనంబు వినంబడుదిక్కుఁజూచె నె
    వ్వారలో మాటలాడుచును వచ్చుట తోఁచె నటంచు నచ్చటన్,
    వారివిమానరత్నమును వారిధరంబుమఱుంగు వాసె బా
    లారుణ భానుబింబ ముదయాద్రిమఱుంగునఁ బాయుచాడ్పునన్. 155

క. ఆ రంభయును గుబేరకు
    మారుఁడు నవ్వేళఁ దమవిమానోత్తమమున్
    నారదమౌనీంద్రుపదాం
    భోరుహములక్రిందిచాయఁ బోనిచ్చి తగన్. 156

ఆ. పారిజాతకుసుమసౌరభంబులు వెద
    చల్లుతమశిరంబు లల్లనల్ల
    నద్దుచును దదీయ మగుపాదయుగళి వా
    సించి రంతఁ గొంత సేపు నిలిచి. 157

క. ఆ వరమౌనియు నొం డోరు
    పై వదలని ప్రేమ కలిగి భాసిలుఁ డనుచున్
    దీవించే రంభ యపు డా
    దైవతమునివర్యుఁ జూచి దరహాసమునన్. 158

 క. ఓమునివర మీదీవన
    చే మాపైఁ బ్రేమ కొంత చెడక నిలుచునో 159