పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

514

కళాపూర్ణోదయం



జినవ్వు తెలినిగ్గు చిలుకుచుఁ దనరాడు
తళుకు లేఁ జెక్కుటద్దములతోడ
జగతి నెందును లేని చక్క (ద నాన సొం
పగుచిన్ని ముద్దు నెమ్మొగముతోడఁ

గీ. గరము విలసిల్లు సకలాంగకములతోడ
రహిఁ దనర్చునలంకారమహిమతోడ
ద్వారశాఖలదండ నింపారుచున్న
ప్రతిమ నొక్కటి చూచే భూపాలచంద్ర.172

క. జూచి మనంబున మెచ్చుచు
నా చేరువ నితఁ డటుండ సంతటిలో భ
వ్యాచారశీలుఁ డచటికి
వా చంయముఁ డొకఁడు మార్గవశముగఁ జేరె.173

గీ. చేరి కాషాయవస్త్రంబు చెఱఁగు విసరు
కొనుచు హరిహరి యనుచు నింపున నొకింత
తడవు గూర్చుండెఁ దత్సవిధప్రదేశ
మండపంబున నధ్వశ్రమంబుకతన.174

సీ. ఆయతీశ్వరుఁ డంత నతిరమ్య మైనయా
లెప్పంపుఁబూఁబోఁడియొప్పుఁ జూచి
బళిర శిల్పికు లేంద్ర బ్రహ్మను మీటి తే
పరిధిఁ జేసితిర యీ ప్రతిమ ననుచు