పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

503

అష్టమాశ్వాసము


   

జాతరముఁ ధూణిపాటె నాయంపచాలు
పుంఖముఖ యుయ్యు ఁ జేబల్మి పొగడఁ దరమె.133

క, ధాసు బార్ట్యోతిషభా
త్రీనాధునిసఖుఁడు ధరణిఁ దెళ్ళుటయును ద
త్సేసలు నెల్లాచెద రై
నానా దిక్కులకు భయమునన్ వెసఁ బఱచెన్.134

వ. అపు డాచండ బాహునిపొటువలన నాటోపంబు దక్కి పొ
ధ్యోతిష పతి యంగపతి శరణుసొచ్చి తనశుద్దాంతకొం తాశి
రోరత్నంబుల కానుక యిచ్చె సంతఁ దద్వార చేతన భీతిల్లి
కోసల ప్రముఖులును మాగధుండును దమయంతన వశవర్తు
లగుచు సమ్మణి స్తంభసుతు నభిమతార్థంబులం దనిపి యను
గ్రహంబు వడసి గివ్విధంబునం గళాపూర్ణుండు సకలదిగేశా
ధీశుల జయించి తత్తత్రియాంగ నామౌళి మాణిక్యంబుల
మధురలాలసాచరణమంజీర నిర్మాణంబు జకు సాధించి
యెందును నెదురు లేక యమందవిజయానందంబునం దిరిగి
వందిమాగధ వారంబులు కైవారంబులు సేయ నిజపట్టణం
బు చేర నరుగుదెంచె నప్పుడు.135

సీ. ఇంక నించుకవడి కిండ్లన విశ్రమిం
తము కూడ రారండు తడయ కనుచు
నలమిఱ్ఱు దాఁటిన ధళధళఁ గాన్పించు
మనవీటిక నకహర్మ్యంబు లనుచుఁ