పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33

ప్రధమాశ్వాసము

    జలజాక్షిజవ్వనము గడు
    వెలసె బ్రతిక్షణము వింతవింతగ నంతన్. 135

ఆ. మొదల బలురేఖ గల దఁట యదియుఁ గాక
    వయసు క్రొత్తఁట వెలయాలివంగడ మఁట
    వనిత చక్కఁదనంబును వన్నెలాఁడి
    తనముఁ గల్కితనంబును దరమె పొగడ.136

సీ. మెఱుగుటద్దముమించుమించు బాగుల నింపు
              నింపుచక్కనిముద్దనెమ్మొగంబు
    నవచంద్రికల నవ్వునవ్వుఠీవులఁ జూపు
              చూపులచొక్కపుసోయగంబు
    నారూఢిఁ బలుమారు మారువిండ్లకు నేర్పు
              నేర్పుకన్బొమదోయి నెఱతనంబు
    కటికిచీకటికప్పుకప్పుపూనిక కొప్పు
              కొప్పుతోరంపుఁబెక్కువబెడంగు

గీ. గుబ్బపాలిండ్లు లేఁగౌను గొప్పపిఱుదు
   బాహులతికలు మృదుపదపల్లవములు
   బంగరుసలాకపస భంగపఱచు మేనుఁ
   గలిగి చెలువొందుచుండు నాచెలువ మిగుల.137

చ. బెళుకులఁ జిమ్ముచుం గలికిబిత్తరిచూపు సరత్న కుండలాం
    చలకషణోజ్జ్వలత్వముపస ల్నెఱపం జళిపించున్ భుజం