పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము. 487


క. ఉలుకుచు నె కఠిసముషిన్
నెటి చెడ నడివీపు వొడిచి నిజభుజముల నే
డేజు 'మెఱయ వానిసంధులు
బిఱుసున వెనుకకుఁ గుదించి పెడ కేల్ గల్టన్ ,

4. వెండియు న ట్టిటు గదలక
యుండ నశం డతులబలర యోద్ధతి మహనీ
యుం డగుచు వానిఁ దద్వే"
దండము)నడికట్టు త్రాళ్ళఁ దగ బంధించెక్ ,

ఉ. ఎంతయు విక్రమం బలర ని టరివీరుని గనైచి తా
నంతట వాని వానిమదహస్తిని జంగున దాఁటి మిక్కిలిన్'
వింతగ సంతరాళమున నెవ్వడిఁ గ్రమ్మణి వ్రాలె సప్పుడో
దంతి నెదిర్చి పోజుతనదంతిపయిన్ రణసమ్ముఖంబుగన్.

గీ. అంత నొక పంట్రకోలచే సహితుకరిని
విరిగిపాఱుఁగఁ బొడిచి పోవిడక మగుడఁ
ట్రిప్పికొని తెచ్చి తత్కుంభ దేశ పార్శ్వ
ములు చుబుకుముట్ట నేయుచు బలము లుణుక .

ఉ. ప్రాణముతోడ నుత్కళనృపాలకు నిమ్మెయిఁ బట్టి తెచ్చి సం
హోణుని జేసి తా విడిచె నెన్నఁడు నిట్ల సమానయుద్ధపా
రీణులతోడ నింక నెదిరింపకుమీ యని బుద్ధి చెప్పి క
ల్యాణగుణాడ్యుం డగషసుధాధిపుఁ డీప్సితరత్న హారి యై.