పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము. 477


గలుగుట నర్థమతులకు గట్టిగ నానృపుదండయాత్ర యిం
పలరఁగఁ జేసెఁ బట్టణమునట్ల యనర్గళభోగ హేతు వై

చ. అలఘుబలప్రతాషయుతుఁడై యతఁడమైయివచ్చుదండువా
ర్తలు వినుచుం దదగ్రదిశ రాజులుగొందఱు ముక్త నూర్గులై
వలసలుపోవువారుఁ దగువస్తువు లప్పన పంపువారుఁ గే
వలవినయంబుతోఁ గొలుచువారును నైరి యథోచిత స్థితిన్.
 
వ. అంత.

సీ. సకలసౌభాగ్యలక్షణధస్య యైనట్టి
మధురలాలసకు నత్యధిక పుణ్య
విభవకు జగదేకవీర పత్నికి సందె
లఖిల దిర్దేశధరాధిపతుల
పట్టపు దేపులు భరియించుమౌళిర
త్నములఁ జేయింపఁ దన్నాధుప్రతిన
యేతదర్ధంబు దం 1: త్తి తా నిదె యమ్మ
హారాజు వచ్చ మీయర్థములను

గీ' బ్రాణముల నిల్పుకొనుఁ డింక రాజులార
యెదురు గాఁ దగ దిష్టంబు లిచ్చి యనిపి
యనుచుఁ దనపత్తి కలు సత్వదాత్ముఁ డనిపె
సరపతుల కెల్లఁ గొండజు నడచి రట్ల.