పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము, 471

వలిసినప్పుడు దాని వ్రాల్చుట కై కట్టి
కట్టిపగ్గములు దీర్ఘాంశులతలు
రతిరాజు సిగి హెచ్చ రజని కాళికి సిడి
యాడుకోకిలభటుఁ డంకశోభ
యతనిమీఁద వసంతమాడుక ప్రఫుధూళ్ళి
చంద్రిక ఏరులు సక్షుత్రసమితి

గీ. యారజనికాళి యెం దేని యరుగఁ దలఁచు
టెకిఁగి వ్రాల్పించుచున్న వాఁ డేమొ యిప్పు
డతఁడు తలసిడికొమ్ము నా సంతకంత
కోలిఁ జంద్రుండు : డమట వ్రాలఁజొచ్చె.

గీ. కోడి తపతప టెక్కలు గొట్టుకొనుచుఁ
గూయుక్రమ మొప్పుమీ తె వేకువ యనియెడు
కనుమ గట్టి వధూమానధనము దోఁచు
నసమశరుఁడు తప్పటఁ గొట్టి యా ర్చె ననఁగ.

ఉ. పారదబద్ద సరటిక పాక పరీక్ష గోనంగఁ జంద్రికా
శ్రీరమునంచుసన్ సమయసిద్ధుఁడు పెట్టె నసంగఁ జాల నొ
ప్పా రెను వేగుచుక్క యదియంటిన చోటు సువర్ణమయ్యెనో
నా రమణీయమైనయరుణద్యుతిఁ దద్దయుఁదూర్పుశోభి లెన్

చ హిమకరుఁ డప్పు డొప్పెఁ బ్రణయించి తుషావృతి నిడ్డగార్ల
పృత్యముక్రియ దక్షిణాగ్ని గతిఁ దాల్చె నగస్త్యుఁ డనూరు దీప్తి