పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

426 కళాపూర్ణోదయము.


హీగ రిమంబు నాఁపుచు నొకించుక లేవఁగఁ బూను మాను
నాలో గొదగొన్న సిగ్గునఁ జెలుల్బలిమిందను జేర్పఁగోరుచున్

వ. అంత నొక్క మిక్కిలి ప్రగల్భ యగుమగువ మిగులం జనవు
మెఱసి.

మ పొది యె నాధులుఁ దారుఁ గాఁపురము లింపుల్ మీఱఁగాఁ
జేయుచుం, గదు పెండేసి కొమాళ్లఁ గూతులఁ దగంగన్నట్టి
యిల్లాండకున్ ,మది లజ్జాదులు లేవె నీకుబలె సన్మానంబు
తోఁ జక్కవ,చ్చెదొ యేమేఁ గలదే యటంచుఁ దిగిచెం జే
వట్టి యాయంగనన్,

వ. అయ్యవసరంబునం గళాపూర్ణుండు తదాగమనంబున కెదు
రుచూచుచుండి వారిగజిబిజి కొంత చేరువను వినంబడినం |
బేయసీవిలోకనోత్కంఠ యాఁప లేక లేచి వచ్చి కౌతుకం
బడర గవాక్ష మార్గంబునం దద్రూపలావణ్య విలాసంబు నిరీ
క్షించుచు నచ్చెరువంది యాపాదమస్తకంబుం గ్రమంబునఁ
బరికించుచుఁ దనమనంబున.

ఉ• క్రిందను మీఁదనుం బడి యకించిదసూయఁ బెనంగులాడున
ందుఁడు నుల్ల సద్బల సమృద్ధతమిస్రముఁబో లెఁ జాలఁ జె
న్నొందెడు ఫాలముం గ బరియున్మటి పాపటము త్తియంపుఁ జే
రుం దిలకంబుకస్తురియు రూఢిగ 'బాహులలీల నొప్పఁగన్ .