పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

420

కళాపూర్ణోదయము.


డొనఁగాఁ జాలక చాలకంత మది యెట్లో యొక్క చందానవీ
డొనియె న్వే మఱపింప లేవు పతిభక్తుల్ మాతృవి శ్లేషమున్.

వ. ఇవ్విధంబున మధురలాలసాపాణిగ్రహణకల్యాణ వైభవం
బు నవధరించుకళాపూర్ణుండు గృహ ప్రవేశమహోత్సవానం
తరంబున దేశాంతరాయాత రాజలోకంబు నస్తోక సత్కార
విశేషంబులం బరితోషంబు నొందించి త తదేశంబుల కనిపె
నంతఁ దద్వధూతిలకంబు వికసితవదన లగుసకియలగుసగుస
లవలన.98

క. తననవ సంగమదిన మది
యని విని యుబ్బుచుఁ బ్రహృష్ట యై మాటికీ వ
చ్చినచోటిక వచ్చుచుఁ బో
యినచోటిక పోవుచుండ నేమో కలఁకన్.99

సీ. మధురలాలస నేఁడు మగనిపా స్పనుచును
నిజకోప మిడ్మించి నీలుచువారు
శోష మేలె ఫలించెఁ గోర్కి నీకని తన
యదరు వేఁతలకు మా జలుగువారు
మాయమ యివి కల్లమాట లింతియె నీవు
గోకోకు మని శాంతి గజపువారు
నిష్పటినుండి మాకేల యప్పుడు చూచే
దివ్వార్త నిజమని నవ్వువారు