పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

418

కళాపూర్లోదయము


   న్గొనుజను లప్పుడు దమలో
   ననయముఁ బ్రమదాద్భుతంబు లావహిలంగన్.87

గీ. కడుఁ గళాపూర్ణుఁ డనుకీ ర్తిఁ గన్నయీతఁ
   డీసతివిశేషమెఱుఁగుట యెన్నవలదె
   యీమధుర వస్తువును గొన నెఱిఁగెఁ గాన
   మధురలాలస యనుపేరు మగువ కొనరు.88

ఆ.అని నుతించి రిట్లు ఘనసమృద్ధిని వివా
   హంబు సంపతిల మదాశయుండు
   పెండ్లికొడుకువెంటఁ బ్రియపుత్రి సనిపె న
   నంతవస్తుతతుల నరణ మిచ్చి.89

వ. ఇవ్విధంబున ననుపునప్పుడు సముచిత లౌకిక వైదికాచారంబులన్నియును విహితంబులు గావించి
   రూపానుభూతి తనకూఁతుఁ బిలిచి యి ట్లని బుద్ధి చెప్పె.90

క. సుముఖాసత్తి మణిస్తం
   భమహాయోగీంద్రులత్తమామలు నీకో
   రమణీమణి నీకోడం
   ట్రము నెఱుఁగరు వారు యోగరసనిశ్చలతన్.91

ఆ.అత్తమామ లన్న నాచార్యుఁ డన్న స
   ద్ధర్మ మన్న నిష్టదైవ మన్న