పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

411

సప్తమాశ్వాసము.

 
వారధారాయితలాజవర్గంబుల సంగడి సంగడిఁ గోలమెజుం
గుల తెజుగున రంగుబాబు బంగారుజలపోఁత బెత్తంబులన
టసఘటిల్లఁ గటిక వారు సారెకుబరాబర్ సేయుచు నేఁగుదేరఁ
జారుతర చతురిమ తురంగ లీలావృత్తమ ంత శ్రవణ భూషణ
వినిర్ముక్తముక్తావర్గనిర్గచ్చచ్ఛవిగుళుచ్ఛంబుల చేత నినుమ
డిముమడి యగుచు రంజిల్లువింజామరలు మంజుహాసామృత
సరోవరాయమానగండస్థలస దేశంబులఁ గాశనీ కాశంబు లై
ప్రకాశింప నాకాశమణి ఘృణిమతల్లిక లయుల్లాసంబు నొ
లక యటు వెనుక చేసి నాళా గ్రంబునం దమక భిముఖంబున
మగిడి నిలిచినప్పుడరీకంబునకుం బుష్పంధయ బాంధవుబు
ను మకరందంబుమిసిమియుం బరాగంబుపసిమియు నసదృ
శంబుగా నొస:గుచు విశేషాధికతం బ్రకటించుముకుటమ
హానీలహీరచామీకరమరీచి వీచికల వైచిత్రి లోచనపర్వం
బు నాచరింప సమాచీన సతతజయసుధా సేకంబున నాకు
లుఁ జిగుళ్ళుఁ బూవులు మవ్వంబు లగుచు నామూలచూ
డంబుగా నుప్పతిల్ల నొప్పుచున్న వియో యనుగ నప్రతిమ
రంగ దంగుళీయకకంకణాంగదఖ చితగారుత్మత పద్మరాగమౌ
క్రికప్రభలశబలిమబలిమిఁ బ్రబలబల బాహు స్తంభముల స్తం
భజృంభణంబు నెఱప నపూర్వనిర్మలత్వయాపేక్షనుం
బోలె నక్షత్రమాలికల చేత బహిరుపాసితం బగుచు హృద
యంబు ప్రకటీకరించినఖనీ భూతకరుణారస రేఖ భావంబున