పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

408

కళాపూర్ణోదయము

 

గీ. నేగి తనకూ తుసింగార 'మెల్ల పెక్కు
మాజు లెగ దిగఁ (గంటఁ బాఱఁజూచి
యింతకంటెను గయి సేయ నెవ్వ రింక
నేర్తు రనుచును 'వారల నేర్పు మెచ్చె.67

సీ. 'మెచ్చి యా చెలువంబు మిక్కిలిఁ జూడ్కికి
వెక్క సం బై తోఁప వెఱఁగుపాటు
గరము లోలోనన కప్పి పుచ్చుచు దృష్టి
దాకునో యనుచును దల్లడిల్లి
పువ్వుదండల నెపంబునఁ గొంత యిది మాటు
పజచెద నని ముగ్గు పట్టియబుతఁ
దగ నొక్క చెంగల్వదండ ము న్నమరించి
యది గుబ్బచనుఁగఁవయందు మిగుల

గీ. వింతగాఁగ నొకానొకవిలసనంబుఁ
జూప నయ్యింతిఁ గడుఁ దాను జూడ జచి
కడమపూదండ లెల్ల నొక్కటిగఁ బట్టి
బాల కపుడు సురాళించి పాజివై చె.68

వ. అట్టిసమయంబునం గళాపూర్ణుండును వివాహంబునకుం గ
ట్టాయితం బై ప్రథమాగమాదిభూ దేవ సముదయాశీర్వాద
నాదంబులును వివిధ పుణ్యాంగ నాసంఘాతమంగళగీతగాన
స్వనంబులును వంది వైతాళిక సూతమాగధస్తుతికోలాహలం