పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

కళాపూర్ణోదయము




గీ. పెద్దము నాదు వొక్కరుఁ బెండ్లికూతుఁ
గాంత లిరువురు తూర్పు మొగంబుగాఁగఁ
బెండ్లి పీఁట పైఁ గూర్చుండఁ బెట్టి నేర్పు
నెరయ సంపెంగనూనె యంటిరి ముదమున.63

క. ప్రేమమున సంభ్రమించుచుఁ
గామిను లంతటను బసుపు గలిపినశుభగం
ధామలకముఁ బెట్టిరి మజి
హైమఘటాంబువుల జలకమార్చిరి సతికిన్.64


సీ. దడిమం పుఁ జేలలఁ దడిగెత్తి పసుపుకొం
గుల తెల్ల పట్టుదువ్వలువ గట్టి
తల వెండ్రుకలఁ బొవడల నట్టి యట్టి శ్రీ
ఫ్రమ తడియార్చి పుష్పములు ముడిచి
మలయజ మంగకంబులఁ బూసి ఘనవాస
నా శేషముగ నది నలిచి వైచి
పాలిండ్లఁ గుంకుమపక్షవల్లులు వ్రాసి
కమ్మకస్తురితిలకంబు దీర్చి

గీ. ముగుదతోంగలి టెప్పల మొదల మిగుల
సన్న మై కనుపట్టఁ గజ్జల మమర్చి
లాక్షఁ బోదాంబుజంబు లలంకరించి
యామదాశయతనయకు నతివ లంత.65