పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

401

సప్తమాశ్వాసము

 
చ. కడు నుతి కెక్కు-నలియధికంపుఁగులీనతచే నతండు న
లడల జనాధిపుల్ దనకుఁ గస్యల నిచ్చెద మంచు నెందటే
బడిబడిఁ జెప్పిపంపనది పాటిగఁబట్టక వారి యీసుచే
నడపొడ లేకపోయెనఁటయల్పములయ్యెఁగులాభిమానముల్

క. జని వేళయందు నురుభా
గ్యనిమి త్తము లగుచుఁ బెక్కు గ్రహము లునికి నా
తని కిడినారఁట సుగ్రహుఁ
డను పే రాశాస్త్ర మేమి యయ్యనొ యెఱుఁగన్.45

వ. అది యెట్టట్టు కాని మ్మిప్పు డింతయు మధురలాలస యుభ
యకులశుద్ధి చెప్పెడు ప్రకారం బింతీయ యని పలికి యిట్ల
నియె.46

క. ఆవనితామణి నిప్పుడు
జీవితము న్ని లిపి ప్రోవఁ జిత్తము గలదే
నోవసుధాధిప పూనుము
వేవేగం దద్వివాహవిధిమంగళమున్.47

క. అని పంచాంగముపుస్తక
మును విడిచి కడుం బ్రయత్నమునఁ దిథివారా
దినిరీక్ష చేసి వేళ్లే
న్ని నిరూపించెన్ గ్రహా దీనిఖిల బలంబుల్.48