పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళాపూర్ణోదయము

-------

సప్తమాశ్వాసము



శ్రీరమణీయ స్వగుణక
థారంజితలోకహృదయ తత నిత్యదయా
సూరిజనారాధనసము
దారస్ఫుటవినయ కొండమాం బాతనయా. 1

  


వ. అవధరింపుము. 2

ఉ. కర్ణ రసాయనోల్లసితక మ్రయశోమహనీయుఁ డాకళా
పూర్ణుఁడు నట్లు కేళివనభూమిఁ గనుంగొను టాదిగాఁగ నా
పూర్ణ సుధాంశుబింబముఖపొల్పు మనంబున నిల్పి తద్గుణో
దీర్ఘ లతాంత సాయక విదీర్ఘ మనోధృతి యై యజ స్రమున్.3

క. తలపోయుచుఁ దనతలఁ పా
యెల నాఁగం బాయకునికి నితర విచారం
బులు విడిచి తాపమునఁ గడు,
నలఁగుచు నే కాంతగృహమునన్ వర్తిలుచున్.4

ఆ. తనకు నర్మసచివుఁడును దిథివారతా
రాదిశంసకుండు నైనయట్టి
యొక్క వృద్ధవిప్రు నొక నాఁడు పిలిపించి
కొంతతడవు నర్మగోష్ఠి నడపి.5