పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

387

షష్ఠాశ్వాసము.



ఆ. అదియుఁ గాక యాధ రాశుఁ డింతకు
మున్ను నునసమీపమునకుఁ దనదు
డేగఁ బిలిచికొనుచు శీవితో రాఁడె చూ
యొప్పు మిగులఁ దొల్మి నుదురఁదోలె.266

క. అది మొదలు వదల కొదవెడు
మదనదశావశత వివశమతి నేతి నిఁకన్
ముదితో చలువలు గిలువలు
మదికి నసహ్యంబు లతనిమన్నన దక్కన్.267

క.కటకట మీ రవి వేకత
నటునిటు శైత్యోపచార మని యేటికి నీ
చ్చటఁ దడ సేద రిఁక వెన్నెల
మీటమిటఁ గాయంగ మేను మిగుల నెఱియదే.268

ఆ. కొఱవి చేతఁ బట్టుకొని చంద్రుఁ డదే వచ్చె
గ్రీష్మసమయ భానురీతి మెజయఁ
దనకు నేల యమృత ధామాఖ్య గోముఖ
వ్యాఘ్ర మనఁగ నిట్టివాఁడు సుమ్ము.269

క.చిలుక చదు వనుట చదివిన
ములుచకు దృష్టాంత మట్టిమూఢ పుదుర్జా
తుల చిలుకఁ దెలిచినం దయ
గలదే మది బెదర వదరుఁగాక నీ జేచ్చన్.270