పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

కళాపూర్ణోదయము


 
తసే, పు నితాంతాకుల యయ్యె సంతటను దాఁ బోనీక యా
బోటియుం , దనపై నానలు పెట్టి పెట్టి యడిగెన్ యత్నంబు
సంధిల్లఁగన్.260


క.ఇమ్మెయి నిర్బంధించుచు
నమ్ముద్దియ యడుగ సృషవరాత్మజ యనుమా
స మ్మొక్క భంగి నుడు పుచు
నెమ్మది నూల్కొల్పి పలికె నిజసఖతోడన్,261

ఉ. ఓహరిణాక్షి నీకు నిఁక నుల్లము దాఁపఁగ నేటికిన్ జగ
న్మోహనమూ ర్తితోడ నిటము న్నొక నాఁటినిశన్ విలాసస
న్నాహముమీఱమద్విభుఁడు నాకలలో పలవచ్చి తేర్చెఁ గా
మాహవ కేళి నద్భుతసుఖికమయం బది యేమి చెప్పుదున్ .

క. అనుచుఁ దదుత్సవలీలలు
మనసునఁ బాఱుటయు వివశమతి యై మోడ్పుం
గనుఁగవతో నొక్కించుక
వనిత నిలిచి ఘర్మపులక వతి యై యంతన్ ,263

వ. ఆకూర్మినెచ్చెలింగటాక్షించి.264

క. చెప్పెడి దేమె లతాంగీ
యప్పురుషోత్తముఁడు నన్ను నట్లు రసాబ్దం
దెప్పలఁదేలిచి నిను విడ
నేప్పుడు నని యూజడించి యెందే నరిగెన్.265