పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

383

షష్ఠాశ్వాసము.


 
దానిచ్చోటం జరించెం దరుణి యతనిస
త్యంతమున్ వింత ప్రేమన్
మే నుబ్బం జూచిన ట్లుండె నది మొదలుసుం
డీకడుం దాప మొందెన్.247


ఉ. కావున నీవసంతమదగర్విత కోకిల కీర శాకా '
రావముఁ దేఁటి పిండుర పురావము మెల్లనిచల్లగాడ్పుఁబూఁ
దావులసొంపుఁ గెంజిగురుఁదండము లేఁబొదరిండ్ల యొప్పులు
న్భావజుపక్ష మై మిగుల బాలిక తాలిమిఁ గొల్లలా డెడిక్ .

ఉ. ఇట్టిది గాన లేము మన మిందజముం దరళాక్షికిన్ మదిం
బుట్టిన పంచబాణువెఱపుల్ మజపింపఁగఁ బూని వానికిం
బట్టపు రాజధాని యనఁ బట్టగుతోఁటకుఁ దెచ్చు టొప్పునే
ఘట్టకుటీ ప్రభాత మనఁగా నిదివో పరికించి చూడఁగన్ ,

క. అనునంతట నయ్యంగన
యనయముఁ బ్రబల మగునట్టియంగజ తాపం
బున నుస్సురస్సురనుచుం
గను టెప్పులు దేలవైచి కడు సోలుటయున్.250

మణి. పడతులు చిడిముడి పడియెడుమదితో
నడుగులు తడఁబడ నడ రెడునడపుం
గడకల నముడులు గడగడ వడఁకం
బడిబడిఁ బొడమఁగ బడలికఁ 'జెమటల్251